
నిడమనూరు మార్కెట్‌ను సందర్శించిన విద్యార్థులు
నిడమనూరు : ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కంపాసాగర్‌కు చెందిన బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు సోమవారం నిడమనూరు వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించారు. విద్యార్థులు మార్కెట్ పరిధిలోని వ్యవసాయ ఉత్పత్తులు, మార్కెట్ సౌకర్యాలను పరిశీలించారు. కొనుగోళ్లు, అమ్మకాల వివరాలను మార్కెట్ చైర్మన్ అంకతి సత్యంను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ ద్వారా పశువులకు వైద్యశిబిరాలు కల్పించి రైతులకు పశుపోషణలో సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో కార్యదర్శి చందర్‌రావు, వర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు.