
కాంగ్రెస్ కుట్రలను తిప్పికొడతాం
నల్లగొండ టూటౌన్: కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా ప్రజల మద్దతుతో తిప్పికొడతామని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం బీఆర్‌ఎస్ నాయకులు నల్లగొండలోని గడియారం సెంటర్‌లో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు పన్ని కేసీఆర్, హరీష్‌రావును బదనాం చేయాలని చూస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రజల మద్దతు కోల్పోయిందని ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడిందని.. ప్రజల దృష్టి మళ్లించడానికే కాళేశ్వరం నాటకం అడుతోందని ధ్వజమెత్తారు. రాస్తారోకో చేస్తున్న కంచర్ల భూపాల్‌రెడ్డిని, బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ సంతకాలు తీసుకుని సొంత పూచికత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో బండా నరేందర్‌రెడ్డి, మందడి సైదిరెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, సింగం రామ్మోహన్, మాలే శరణ్యారెడ్డి, నాగార్జున, బక్క పిచ్చయ్య, యుగంధర్ రెడ్డి, బోనగిరి దేవేందర్, చీరా పంకజ్ యాదవ్, , రేగట్టే మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చేతకాని దద్దమ్మ సీఎం రేవంత్‌రెడ్డి : చిరుమర్తి
నకిరేకల్ : ప్రజలకు ఇచ్చిన హమీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న చేతకాని దద్దమ్మ సీఎం రేవంత్‌రెడ్డి అని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన కమిషన్‌ను ఎత్తి వేయాలని కోరుతూ నకిరేకల్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సోమవారం రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డం పెడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. సాగర్ నీళ్లు ఆంధ్రాకు పోతుంటే తెలంగాణ ప్రజలకు నీళ్లు ఇచ్చే సోయి మరిచి బీఆర్‌ఎస్ నేతలపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ కాళ్లు పట్టుకుని.. కాళేశ్వరంపై కేసులు వేయిస్తూ కేసీఆర్‌ను అణిచి వేయాలని కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తక్షణమే కేసులును ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మార్కెట్, మున్సిపల్ మాజీ చైర్మన్లు కొప్పుల ప్రదీప్‌రెడ్డి, రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీలు తలారి బలారం, మాద ధనలక్ష్మీనగేష్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్‌రావు, మారం వెంకట్‌రెడ్డి, నాయకులు పెండెం సదానందం, రాచకొండ వెంకన్నగౌడ్, సామ శ్రీనివాస్‌రెడ్డి, పల్లె విజయ్, పల్‌రెడ్డి మహిందర్‌రెడ్డి, వంటల చేతన్, గోర్ల వీరయ్య, యానాల లింగారెడ్డి, పేర్ల శ్రీకాంత్, నోముల కేశవరాజు, రావిరాల మల్లయ్య పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
ఫ కాళేశ్వరంపై ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ నల్లగొండలో బైక్‌ర్యాలీ, రాస్తారోకో