
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి
నల్లగొండ టౌన్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉగ్యోగ సంఘాల జేఏసీ చైర్మన్, టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి, టీఎన్‌జీఓ జిల్లా కార్యదర్శి జే.శేఖర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ ఎదు నల్ల చొక్కాలు ధరించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీపీఎస్‌కు సంబంధించి వేతనంలో కట్ చేసిన ఉద్యోగుల వాటాకు, ప్రభుత్వ వాటాను జమ చేయకపోవడం దారుణమన్నారు. సీపీఎస్ ద్వారా ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని, హెల్త్ కార్డులను అమలు చేయాలని, పెండింగ్ సమస్యలను పరిస్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం హైదరాబాద్‌లో నిర్వహించే ధర్నాకు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. కార్యక్రమంలో జేఏసీ కో చైర్మన్లు వెంకటేశ్వర్లు, రాజశేఖర్, తరాల పరమేష్, అలీం, వెంకులు, శ్రీనివాస్, భిక్షమయ్య, జనార్దన్, సందీప్‌రెడ్డి, చరితరెడ్డి, కృష్ణమూర్తి, శ్రీశైలం, వెంకట్రామ్‌రెడ్డి, చేపూరి నర్సింహాచారి, రాంబాబు, ఆకునూరి లక్ష్మయ్య, వెంకట్‌రెడ్డి, మనోజ్‌కుమార్, ప్రవీణ్, సైదులు, సత్యనారాయణ, కాశీం, మధు, రమాదేవి, నరేష్, రమ్యసుధ, శ్రీనివాస్, అజీమ్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మురళి
ఫ కలెక్టరేట్ ఎదుట ధర్నా