
అమ్మలా ఆదరించి.. ఆదుకుంటానని భరోసా ఇచ్చి..
మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందిన చొల్లేటి సోని మానసిక దివ్యాంగురాలు. తల్లితో కలిసి గ్రీవెన్స్ హాల్ వద్దకు వచ్చింది. గ్రీవెన్స్ హాల్ ముందు సోని పడుకుంది. గ్రీవెన్స్ హాల్‌కు వస్తున్న కలెక్టర్ ఆ బాలికను చూసి తల్లిని వివరాలు అడిగింది. ఇప్పటి వరకు తన కూతురుకు పింఛన్ వచ్చేదని.. ఐరిష్, తంబ్ రాకపోవడం వల్ల ఇప్పుడు ఇవ్వనంటున్నారని.. కలెక్టర్‌కు వివరించింది. స్పందించిన కలెక్టర్ ఇక్కడి నుంచి ఇంటికి వెళ్లండని.. తహసీల్దార్ వచ్చి మీ వివరాలు తెలుసుకుని మీ సమస్య పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారు. బాలికకు వైద్య పరమైన సహాయం అందించాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు. అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, కలెక్టరేట్ ఏఓ మోతిలాల్ వారికి కొంత ఆర్థిక సాయం అందజేశారు.