
అమ్మా.. మా గోడు వినండి!
నల్లగొండ : అమ్మా.. మా గోడు విని.. మా సమస్య పరిష్కరించండి అంటూ పలువురు బాధితులు కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ప్రజలు కలెక్టరేట్‌కు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మొఒత్తం 99 మంది కలెక్టర్ ఇలా త్రిపాఠి, అధికారులకు వినతులు సమర్పించారు. వాటిలో రెవెన్యూ శాఖకు సంబంధించినవి 69.. ఇతర ఫిర్యాదులు 30 ఉన్నాయి. వాటిని పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆయా శాఖలకు పంపారు. ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇచ్చి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జె.శ్రీనివాస్, నారాయణ్ అమిత్, డీఎంహెచ్‌ఓ పుట్ల శ్రీనివాస్ ఉన్నారు.
ఫ గ్రీవెన్స్‌డేలో కలెక్టర్‌కు బాధితుల విన్నపం
ఫ వినతులు స్వీకరించి భరోసా ఇచ్చిన కలెక్టర్ ఇలా త్రిపాఠి