
టీబీని పసిగడుతుంది..
నల్లగొండ : టీబీ వ్యాధి లక్షణాలను ముందుగానే పసిగట్టే పరికరాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఆవిష్కరించారు. రూ.20 లక్షల విలువ చేసే ఈ పరికరాన్ని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అందించింది. రోగిలో టీబీ లక్షణాలను ముందుగా కనిపెట్టడం ఈ పరికరం ప్రత్యేకత. కార్యక్రమం అదనపు కలెక్టర్ శ్రీనివాస్, పౌరసరఫరాల అధికారి వెంకటేష్, మేనేజర్ హరీష్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కర్నాటి నారాయణ, ప్రధాన కార్యదర్శి రేపాల భద్రాద్రి రాములు, మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్, వెంకటరమణ చౌదరి, గంట సంతోష్‌రెడ్డి, చిల్లంచర్ల శ్రీనివాస్, పవన్‌కుమార్ పాల్గొన్నారు.