
రోడ్డు ప్రమాదంలో సీఆర్‌పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ మృతి
చివ్వెంల : అతి వేగంగా వస్తున్న డీసీఎం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం బీబీగూడెం శివారులోని సూర్యాపేట–ఖమ్మం రహదారిపై శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఆత్మకూర్(ఎస్) మండల ఏనుబాముల గ్రామానికి చెందిన కలకోట్ల శ్రీను (47) సీఆర్‌పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్‌గా అస్సాంలో పనిచేస్తున్నారు. ఇటీవలే సెలవులపై వచ్చిన ఆయన శనివారం సూర్యాపేటలో బంధువుల ఇంట్లో దశదిన కర్మకు హాజరై తిరిగి బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో బీబీగూడెం గ్రామ శివారులో ఖమ్మం నుంచి సూర్యాపేటకు వస్తున్న డీసీఎం బైక్‌ను ఎదురుగా ఢీకొట్టింది. దీంతో శ్రీను తలకు తీవ్రగాయమైంది. అతడిని సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందారు. మృతుడి కుమారుడు రాకేష్ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మహేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.