
బత్తాయి రైతులకు పరిహారం చెల్లించాలి
జిల్లాలో తిరుపతి యూనివర్సిటీ నాసిరకం అంటు మొక్కలతో నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం చెల్లించాలనే ప్రధాన డిమాండ్‌ను రైతు కమిషన్ ముందు ఉంచాం. ఆయా రైతులకు ఉచితంగా బత్తాయి మొక్కలు అందించడంతోపాటు డ్రిప్ సౌకర్యం కూడా ఉచితంగా అందించాలి. కాపుకు వచ్చే నాలుగేళ్ల వరకు నిర్వహణ ఖర్చులు ప్రభుత్వమే చెల్లించాలి. జిల్లాలో బత్తాయి రైతాంగాన్ని ఆదుకోవడానికి అవసరమైన మార్కెట్, తదితర అన్ని రకాల చర్యలను తీసుకోవాలి.
– శ్రీనివాస్‌రెడ్డి, బత్తాయి రైతు పరస్పర సహాయ సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు