
దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంచాలి
నల్లగొండ టౌన్ : దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంచాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. ఆదివారం నల్లగొండలోని ఎస్‌బీఆర్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన చేయూత పింఛన్‌దారుల సభలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చేయూత పింఛన్లను పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. మోసం చేసిందన్నారు. ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు కనీసం మాట్లాడడం లేదన్నారు. తాను గుడిసెలో పుట్టిన బిడ్డగా పింఛన్‌దారుల పక్షాన పోరాటానికి ముందుకొచ్చానని తెలిపారు. పింఛన్ల మొత్తం పెరిగేంత వరకు పోరాటం ఆగదన్నారు. ఈ నెల 3న హైదరాబాద్‌లో జరిగే చేయూత పింఛన్‌దారుల మహా గర్జనకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కొత్త వెంకన్నయాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుముల జలంధర్, గడ్డం కాశీం, పెరిక శ్రీనివాస్, బకరం శ్రీనివాస్, ఇరిగి శ్రీశైలం, దాసరి లక్ష్మమ్మ, రెడ్డిమాస్ ఇంద్రచౌదరి, అహ్మద్‌ఖాన్, సైదులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు
మంద కృష్ణమాదిగ