
స్థానిక సమస్యలపై నేడు, రేపు ధర్నాలు
మిర్యాలగూడ : స్థానిక సమస్యల పరిష్కారం కోసం సోమ, మంగళవారాల్లో ఉమ్మడి జిల్లాలోని అని మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం మిర్యాలగూడలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజాప్రతినిధులు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోందన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో అనేక గ్రామాల్లో, పట్టణాల్లో అధ్యయన యాత్రలు నిర్వహించామని యాత్రలో వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు ధర్నాలు చేపడుతున్నట్లు తెలిపారు. మండల కేంద్రాల్లో జరిగే ధర్నాలకు అన్నివర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని అన్నారు. పీడిత ప్రజల కోసం నాడు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించి బీజేపీ రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నిస్తుందన్నారు. నాడు జరిగిన పోరాట వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. దీని కోసం ఈనెల 10 నుంచి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు డబ్బికార్ మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, మల్లు గౌతంరెడ్డి, రవినాయక్, వినోద్‌నాయక్, రెమిడాల పరుశురాములు, అయూబ్, పాల్వాయి రాంరెడ్డి, కరీమున్నిసా, దయానంద, బక్క శ్రీనివాస్‌చారి, రమణారెడ్డి, లక్ష్మీనారాయణ, రామారావు తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి