
2న గుండ్రాంపల్లిలో బీజేపీ సభ
చిట్యాల : రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈ నెలన 2వ తేదీన చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి తెలిపారు. గుండ్రాంపల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించిన ఆ పార్టీ జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజాం రజాకార్ల సైన్యానికి ఎదురొడ్డి పోరాడిని చేసిన గుండ్రాంపల్లిలోనే అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించనున్న బహిరంగ సభలో రెండు వేల మంది పాల్గొంటారని తెలిపారు. ఈ సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హాజరవుతున్నారని తెలిపారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్‌కీబాత్ 125వ ఏపిసోడ్‌ను వీక్షించారు. ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు పీక వెంకన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూధన్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు వీరేల్లి చంద్రశేఖర్, నూకల వెంకటనారాయణరెడ్డి, మండల వెంకన్న, విద్యాసాగర్‌రెడ్డి, మైల నర్సింహ, చంద్రశేఖర్‌రెడ్డి, మైల పరమేష్, సోమగోని నర్సింహ తదితరులు పాల్గొన్నారు.