
జిల్లా కోర్టులో ఐ డోనేషన్ సెంటర్ ప్రారంభం
రామగిరి(నల్లగొండ) : నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా జిల్లా కోర్టులో ఐ డోనేషన్ సెంటర్‌ను జిల్లా జడ్జి ఎం.నాగరాజు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేత్రదానం చేసేందుకు మృతుల కుటుంబాలు ముందుకు రావాని కోరారు. అంతకుముందు నేత్రదాన పక్షోత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం బార్ అసోసియేషన్ హాల్‌లో న్యాయవాదులకు నూతనంగా ఏర్పాటు చేసిన లాకర్లను ప్రారంభించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కట్టా అనంతరెడ్డి, ఎం.నగేష్, న్యాయవాదులు, లయన్స్ క్లబ్ చారిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.