
మార్కెట్ వ్యవస్థను పటిష్టం చేస్తాం
నల్లగొండ అగ్రికల్చర్ : బత్తాయి మార్కెట్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి చెప్పారు. శుక్రవారం నల్లగొండలోని ఎస్‌ఎల్‌బీసీ బత్తాయి మార్కెట్‌ను పరిశీలించి మాట్లాడారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎస్‌ఎల్‌బీసీ బత్తాయి మార్కెట్ నిర్వహణ సరిగా లేదని, దీనిని పటిష్టం చేస్తామని తెలిపారు. స్థానిక మార్కెట్‌లో దళారుల జోక్యం ఎక్కువగా ఉండడం, రైతుల కన్నా ఇతరులే ఎక్కువగా బత్తాయి అమ్ముతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు కలిసి వారి సమస్యలను విన్నవించారు. కార్యక్రమంలో సునీల్ కుమార్, మరికంటి భవాని, చెవిటి వెంకన్నయాదవ్, గోపాల్, హరివెంకటప్రసాద్, ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ బాబు, మార్కెట్ చైర్మన్ రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్‌రెడ్డి, మార్కెటింగ్ శాఖ వరంగల్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి, శ్రీనాథరాజు, సుభాషిని, అనంతరెడ్డి పాల్గొన్నారు.