
ధాన్యం దారి మళ్లింపుపై విచారణ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో ఆరు మిల్లుల అక్రమాలపై విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. పభుత్వం నుంచి తీసుకున్న ధాన్యానికి సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్‌ను (సీఎంఆర్) ఆరుగురు మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వకుండా కాకినాడ పోర్టుకు తరలించారంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, పౌర సరఫరాల శాఖ కమిషనర్‌కు ఫిర్యాదులు అందాయి. దాని ద్వార ప్రభుత్వానికి రూ.కోట్లలో నష్టం వాటిల్లిందని ఫిర్యాదులు అందడంతో పౌరసరఫరాల శాఖ రంగంలోకి దిగింది.
పక్కదారి పట్టిన బియ్యంపై విచారణ
జిల్లాలోని నల్లగొండ, మునుగోడు, చిట్యాల ప్రాంతాలకు చెందిన మిల్లులు ప్రభుత్వానికి సీఎంఆర్ ఇవ్వలేదు. ఆరుగురు మిల్లర్లు 4.15 లక్షల క్వింటాళ్లకు పైగా ధాన్యానికి సంబంధించి 2.75 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని ప్రభుత్వానికి ఇ్వకపోవడంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఈ వ్యవహారంపై విచారణ చేయించాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.
ఫ సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. రంగంలోకి పౌర సరఫరాల శాఖ
ఫ సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్‌కు ఆదేశాలు
ఫ ఐదుగురు సభ్యులతో విచారణకు కమిటీ నియామకం
ఫ కన్వీనర్‌గా జిల్లా పౌర సరఫరాల అధికారి