
ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్
తిప్పర్తి : పోలీస్‌స్టేషన్‌లో సీజ్ చేసిన వాహనాలు, గుర్తు తెలియని వాహనాలను అమ్ముతున్నారని, సెటిల్‌మెంట్లు చేసి డబ్బులు తీసుకుంటున్నారని తేలడంతో తిప్పర్తి పోలీస్‌స్టేషన్‌లోని ఇద్దరు కానిస్టేబుళ్లు వసీం, ఉపేందర్‌పై ఎస్పీ శరత్‌చంద్ర పవార్ సస్పెన్షన్ వేటు వేశారు. సదరు కానిస్టేబుళ్లు ఇటీవ ఒక గుర్తుతెలియని బైక్‌ను మెకానిక్ వద్ద మరమ్మతు చేయించి ఓ వ్యక్తికి విక్రయించారు. ఆ డబ్బు పంపకాల్లో ఇద్దరు కానిస్టేబుళ్ల మధ్య రూ.500 తేడా వచ్చింది. దీంతో విషయం అందరికి తెలిసింది. దీనిపై తిప్పర్తి ఎస్‌ఐ శంకర్.. ఎస్పీకి నివేదిక పంపారు. విచారణన చేపట్టిన ఎస్పీ ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారని తిప్పర్తి ఎస్‌ఐ శంకర్ తెలిపారు.
ప్రభుత్వ కళాశాలల్లో చేరాలి
డిండి : ఇంటర్మీడియట్ విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనే చేరాలని రాష్ట్ర ఇంటర్ బోర్డు అధికారి భీమ్‌సింగ్ సూచించారు. మంగళవారం డిండిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన సందర్శించి మాట్లాడారు. ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పిస్తోందన్నారు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ కళాశాలల్లో ఎంసెట్, నీట్ ప్రవేశపరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామన్నారు. ఆయన వెంట అధ్యాపకులు ఆంజనేయులు, సంతోష్‌కుమార్, శ్రీరాములు, హన్మంతు, లింగస్వామి, ప్రేమానందం, జానయ్య తదితరులు ఉన్నారు.
విద్యారంగాన్ని నిర్వీర్యం చేయొద్దు
అడవిదేవులపల్లి : విద్యరంగాన్ని నిర్వీర్యం చేయొద్దని ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ సభ్యుడు ఖమ్మంపాటి శంకర్ అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘సంక్షేమ హాస్టళ్ల సంరక్షణ– ప్రభుత్వ విద్యా పరిరక్షణ’ పేరుతో చేపట్టిన సైకిల్ యాత్ర మంగళవారం అడవిదేవులపల్లి మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేవన్నారు. అడవిదేవులపల్లి కేజీబీవీకి ప్రహరి గోడలు లేకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణాకు విద్యా శాఖ మంత్రి కూడా లేకుండా పోయాడని అన్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజురీయింబర్స్‌మెంట్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎప్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కుర్ర సైదానాయక్, కుంచం కావ్య, స్పందన, రవీందర్ ఉన్నారు.

ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్