
గుణాత్మక విద్య అందించాలి
మర్రిగూడ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మంగళవారం ఆమె మర్రిగూడలోని కేజీబీవీని సందర్శించి పాఠశాలలో పారిశుద్ధ్యం, విద్య, భోజనం, వసతి సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలని అంతేకాకుండా నాణ్యమైన భోజనం అందించాలన్నారు. తరగతి గదిలో విద్యార్థినులకు పాఠాలు బోధించి పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. అంతకుముందు మర్రిగూడలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఆమె తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని డయాలసిస్ యూనిట్, ఇతర విభాగాలను పరిశీలించి ఓపీ, ఐపీ, ఏఎన్‌సీ రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఆస్పత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఆమె వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ మాతృనాయక్, చండూరు ఆర్డీఓ వి.శ్రీదేవి, తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు, సూపరింటెండెంట్ శంకర్‌నాయక్, ఎస్‌ఓ జ్యోతి, వైద్యురాలు శాలిని, హరిప్రియ, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి