
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని ధర్నా
నల్లగొండ : ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు గడిచినా ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. విద్యలో కార్పొరేట్ శక్తులను నియంత్రించకపోవడం వల్ల సామాజిక అంతరాలు పెరిగిపోయాయన్నారు. కాంగ్రెస్ ఇచ్చి హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే దశలవారీ ఉద్యమంలో భాగంగా ఆగస్టు 23న హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. కార్యక్రమంలో యూఎస్‌పీఎస్‌సీ నాయకులు బక్క శ్రీనివాసచారి, రత్నయ్య, వెంకటేశం, జి.నాగమణి, పెరుమాళ్ల వెంకటేశం, పి.వెంకులు, ఖుర్షిద్‌మియా, నర్రా శేఖర్‌రెడ్డి, వడ్త్యా రాజు, జి.అరుణ, యాట మధుసూదన్‌రెడ్డి, మురళయ్య, పగిల్ల సైదులు, కొమర్రాజు సైదులు, గణేష్, అంజయ్య, లక్ష్మయ్య, జగతి పాల్గొన్నారు.