
ఎక్కడ చూసినా దెబ్బతిన్న రోడ్లే..
క్లాక్ టవర్ నుంచి రామగిరి వెళ్లే రోడ్డు, రామగిరి చౌరస్తా నుంచి ఎన్‌జీ కాలేజీ వెళ్లే రోడ్డు, బోయవాడ, విద్యుత్ శాఖ కార్యాలయం ముందు రోడ్డు, బొట్టుగూడ, దేవరకొండ రోడ్డు అంబేద్కర్ సర్కిల్, ఆర్‌పీ రోడ్డు, బహార్‌పేట, తులసి నగర్ రోడ్డు, క్లాక్ టవర్ వద్ద జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద, సావర్కర్ నగర్ రోడ్డు, ఫ్లైఓవర్ వద్ద, పానగల్ రోడ్డు ఇలా ఎక్కడ చూసినా దెబ్బతిన్న రోడ్లతో ప్రయాణికులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. అయినా ఏ శాఖకు నీలగిరి మంటే పట్టణం పట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.