
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
నార్కట్‌పల్లి : రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని గోపాలయపల్లి, నార్కట్‌పల్లి, మాదవ ఎడవల్లి, ఏపీ లింగోటం చెరువులను నింపేందుకు తొలిసారిగా బుధవారం బి.వెల్లంల ప్రాజెక్టు కుడికాల్వ నీటి విడుదల చేశారు. ప్రాజెక్టులో భాగంగా గోపలాయపల్లి వరకు కొనసాగి నిలిచిన కుడి కాల్వ పనులను నార్కట్‌పల్లి చెరువు వరకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర గోపాలయపల్లి, నార్కట్‌పల్లి, మాదవ ఎడవల్లి, ఏపీ లింగోటం గ్రామాల రైతులు సొంత ఖర్చుతో జేసీబీని పెట్టి పూర్తిచేసుకున్నారు. దీంతో ఈ కాల్వ ద్వారా చెరువులకు ఎమ్మెల్యే నీటిని విడుదల చేసి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన బి.వెల్లంల ప్రాజెక్టును కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక చొరవతో పూర్తిచేసుకుని నేడు సాగునీటిని అందుస్తున్నామని పేర్కొన్నారు. ఈ నాగులు గ్రామాల చెరువుల నిండితే వరి వంటకు సాఉనీటి ఇబ్బందులు ఉండవన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు భూ సేకరణ పూర్తిచేసేందుకు ప్రజలు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, డీఈలు పిచ్చయ్య, విఠలేశ్వర్, ఏఈ నవిన్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బత్తుల ఉషయ్య, బండా సాగర్‌రెడ్డి, వడ్డే భూపాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐతరాజు యాదయ్య, నాయకులు దూదిమెట్ల సత్తయ్య, సట్టు సత్తయ్య, పుల్లెంల అచ్చాలు, పాశం శ్రీనివాస్‌రెడ్డి, జేరిపోతుల భరత్, నేతగాని కృష్ణ, గోసుల భద్రచలం, దొండ రమేష్, సిద్దగోని స్వామి, పశుపతి, వెంకన్న, శశిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం
ఫ బి.వెల్లంల కుడికాల్వ ద్వారా తొలిసారి చెరువులకు నీటి విడుదల