
విద్యతోనే మెరుగైన జీవితం
నిడమనూరు : విద్యతోనే మెరుగైన జీవితం, ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నిడమనూరు కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాన్ని బుధవారం సాయంత్రం ఆమె సందర్శించారు. రాత్రి 8.30 గంటల వరకు అక్కడే ఉన్నారు. ఈ సందదర్భంగా విద్యార్థినులతో ముచ్చటించారు. తాను ఉత్తరప్రదేశ్ లక్నో నుంచి నల్లగొండకు కలెక్టరుగా వచ్చానని.. చదువుకుంటే ఎక్కడికై నా వెళ్లవచ్చని, ఏదైనా సాధించవచ్చని చెప్పారు. పాఠశాల గోడపై ఉన్న హిందీ స్లోగన్స్‌ను విద్యార్థినులతో చదివించారు. పలు ప్రశ్నలు అడిగి చాక్లెట్లు ఇచ్చారు. 9వ, 10వ తరగతి విద్యార్థినులు తమ సహచర 6వ, 7వ, 8వ తరగతి చిన్నారుల ఆరోగ్యం, విద్యలో సలహాలు అందిస్తూ, మంచిగా చూసుకుంటే.. 9వ, 10వ తరగతి విద్యార్థులను డిసెంబరు 25న హైదరాబాద్ టూర్‌కు పంపుతానని, ఇంటర్‌లో ప్రథమ ర్యాంకు సాధిస్తే విమానం ఎక్కే అవకాశం కల్పిస్తానని చెప్పారు. విద్యాలయంలో మరమ్మతు పనులకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని ఏఈకి సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, తహసీల్దార్ జంగాల కృష్ణయ్య, ఎండీఓ వెంకటేషం, ఎంఈఓ ఎల్.వెంకన్న, పంచాయతీ కార్యదర్శి మధు తదితరులు ఉన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి