
‘బుద్ధుడితో నా ప్రయాణం’ నాటక ప్రదర్శన
రామగిరి(నల్లగొండ) : బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ నల్లగొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నల్లగొండ పట్టణంలోని అలకాపురి కాలనీలోని కోటిరెడ్డి ఫంక్షన్ హాల్‌లో అంబేద్కర్ జీవిత చరిత్ర ఆధారంగా ‘బుద్ధుడితో నా ప్రయాణం’ నాటికను ప్రదర్శించారు. ప్రేక్షకులు అధిక సంఖ్యలో పాల్గొని నాటకాన్ని తిలకించారు. కార్యక్రమంలో బుద్ధిస్ట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు పరంధాములు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంకు హరి, నామ వెంకటేశ్వర్లు, పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ జిల్లా కోఆర్డినేటర్ మండల ఆంజనేయులు, కన్వీనర్ నూనె విష్ణు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ కొత్త నగేష్, కోశాధికారి గోలి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

‘బుద్ధుడితో నా ప్రయాణం’ నాటక ప్రదర్శన