
గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
భువనగిరిటౌన్: భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పుప్పాల వెంకటేశ్వర్లు(41) సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. విధుల్లో భాగంగా హైదరాబాద్‌కు వెళ్లిన ఆయన అస్వస్థతకు గురై పడిపోయారు. వెంటనే అతడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలానికి చెందిన వెంకటేశ్వర్లు గతేడాది భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్‌కు బదిలీపై వచ్చారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వెంకటేశ్వర్లు మృతి పట్లు ఇన్‌స్పెక్టర్ రమేష్‌కుమార్, ఎస్‌ఐలు కుమారస్వామి, లక్ష్మీనారాయణ, జయరాజు సంతాపం ప్రకటించారు.