
టీబీ రహిత జిల్లాగా మారుద్దాం
మిర్యాలగూడ : జిల్లాను టీబీ రహితంగా మార్చేందుకు సవాలుగా తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం మిర్యాలగూడలోని మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్‌పై ఏర్పాటు చేసిన సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. వైద్యారోగ్యశాఖలో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు గుర్తింపు వచ్చేలా విధులు నిర్వహించాలన్నారు. మిర్యాలగూడ ప్రాంతంలో రైస్ మిల్లులు అధికంగా ఉండడం వల్ల దుమ్ముధూలితో ప్రజలకు టీబీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నందున రెండు వారాలకు మించి దగ్గు ఉండే వారిని గుర్తించి పరీక్షలు చేయాలన్నారు. నల్లగొండ, మిర్యాలగూడ రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ల తరఫున రూ.20లక్షల విలువ చేసే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్‌రే మిషన్‌ను వైద్యారోగ్యశాఖకు ఇవ్వడంతో సంఘం ప్రతినిధులను అభినందించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, టీబీ నియంత్రణ అధికారి కల్యాణ్‌చక్రవర్తి, డీఎంహెచ్‌ఓ పుట్ల శ్రీనివాస్, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ మాతృనాయక్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు వేణుగోపాల్‌రెడ్డి, రవి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, రైస్ మిల్లర్స్ సంఘం రాష్ట్ర ఉపాద్యక్షుడు కర్నాటి రమేష్, మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్, సంఘం కార్యదర్శి బాబి పాల్గొన్నారు.
ఎమ్మార్పీకే యూరియా అమ్మాలి
మిర్యాలగూడ : ఎమ్మార్పీకే యూరియా అమ్మాలని, అధిక రేట్లకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. మిర్యాలగూడ శివారులోని అవంతి వేర్ హౌసింగ్ ఫర్టిలైజర్స్ గోదాంను గురువారం కలెక్టర్ తనిఖీ చేసి మాట్లాడారు. ఆమె వెంట సబ్ కలెక్టర్ నారాయణ్‌అమిత్, డీఏఓ శ్రవణ్‌కుమార్, ఇన్‌చార్జి ఏడీఏ సైదానాయక్, మార్కెఫెడ్ డీఎం ఎన్.జ్యోతి ఉన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి

టీబీ రహిత జిల్లాగా మారుద్దాం