
పునాది దశలోనే ట్యాంకుల నిర్మాణం
చిట్యాల : చిట్యాల మున్సిపాలిటీకి అమృత్ 2.0 పథకం కింద రూ.12.50 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో మూడు మంచినీటి నిల్వ ట్యాంకుల నిర్మాణంతో పాటు 16 కిలోమీటర్ల పైపులైన్ నిర్మాణ పనులు, 1600 ఇళ్లకు రెండు కి.మీ నీటి సరఫరా పైపులైన్ పనులను చేపట్టాల్సి ఉంది. ఈ పనులకు ఏడు నెలల క్రితం శంకుస్థాపన చేశారు. కాగా.. ట్యాంకులు బునాది దశలోనే ఉన్నాయి. 16 కిలోమీటర్ల పైప్‌లైన్‌కుగాను 3 కి.మీ పూర్తయింది. సీసీ రోడ్లను ధ్వంసం చేసి పైపులైన్ పనులు చేపడుతున్నారు. ధ్వంసం చేసిన సీసీ రోడ్లుకు మరమ్మతులు చేపట్టలేదు. దీంతో ఆయా వార్డుల్లో వాహనదారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.