కుర్రి శ్రీనుకు నివాళులర్పించిన మంత్రి ఉత్తమ్‌ | - | Sakshi
Sakshi News home page

కుర్రి శ్రీనుకు నివాళులర్పించిన మంత్రి ఉత్తమ్‌

Jul 6 2025 7:01 AM | Updated on Jul 6 2025 7:01 AM

కుర్ర

కుర్రి శ్రీనుకు నివాళులర్పించిన మంత్రి ఉత్తమ్‌

నకిరేకల్‌: హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన కాంగ్రెస్‌ సభకు కారులో వెళ్లొస్తుండగా.. కట్టంగూర్‌ మండలం పామునగుండ్ల శివారులో లారీ ఢీకొట్టడంతో మఠంపల్లి మండలం కిందితండా గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు కుర్రి శ్రీను మృతిచెందగా. అదే గ్రామానికి చెందిన మరో ఐదుగురికి గాయాలయ్యాయి. పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్‌ ఏరియా ఆస్పత్రిలో ఉంచిన కుర్రి శ్రీను భౌతికకాయానికి శనివారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నివాళులర్పించారు. ప్రభుత్వ పరంగా శ్రీను కుటుంబానికి రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని మంత్రి ప్రకటించారు. అంతేకాకుండా తక్షణ సహాయం కింద సొంతంగా రూ.5లక్షలు అందజేశారు. మృతుడి భార్యకు ప్రభుత్వం ఉద్యోగం, అతడి పిల్లలకు విద్య అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను నల్లగొండ డీఎస్పీని అడిగి తెలుసుకున్నారు. మృతుడు ఽశ్రీను అంత్యక్రియలను దగ్గరుండి చూసుకోవాలని ఆయన హుజూర్‌నగర్‌ నియోజకవర్గ నాయకులకు సూచించారు. మంత్రి వెంట నకిరేకల్‌ ఎమ్మెల్యే వీరేశం సతీమణి పుష్ప, మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య, పట్టణ అధ్యక్షుడు లింగాల వెంకన్న తదితరులు ఉన్నారు.

కిందితండాలో విషాదఛాయలు..

మఠంపల్లి: కుర్రి శ్రీను మృతితో కిందితండా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శనివారం రాత్రి శ్రీను అంత్యక్రియలను అశ్రునయనాల మధ్యన పూర్తిచేశారు. కాగా అదే గ్రామానికి చెందిన వీరన్ననాయక్‌, మాలోతు శ్రీనునాయక్‌, బాబునాయక్‌, మేఘానాయక్‌, నాగేశ్వరరావునాయక్‌కు గాయాలు కావడంతో వారు చికిత్స పొందుతున్నారు.

లారీ డ్రైవర్‌పై కేసు నమోదు..

కట్టంగూర్‌: ఈ ప్రమాదానికి కారణమైన గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్‌ జుగ్‌రాజ్‌సింగ్‌పై మృతుడి భార్య కుర్రి శ్రీదేవి ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కట్టంగూర్‌ ఎస్‌ఐ రవీదర్‌ తెలిపారు.

ఫ మృతుడి కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.10లక్షలు ఇస్తామని ప్రకటన

ఫ తక్షణ సహాయం కింద సొంతంగా రూ.5లక్షలు అందజేత

ఫ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ సభకు వెళ్లొస్తుండగా కట్టంగూర్‌ వద్ద జరిగిన

రోడ్డు ప్రమాదంలో శ్రీను మృతి

కుర్రి శ్రీనుకు నివాళులర్పించిన మంత్రి ఉత్తమ్‌1
1/1

కుర్రి శ్రీనుకు నివాళులర్పించిన మంత్రి ఉత్తమ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement