
ధాన్యం కొనుగోలుకు ముందస్తుగా సిద్ధం కావాలి
నల్లగొండ : వానాకాలం సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు ముందే చేసుకోవాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అధికారులకు సూచించారు. శుక్రవారం తన చాంబర్‌లో వానాకాలం– 2025 సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పలు అంశాలపై సమీక్షించారు. యాసంగిలో 2 వేల మెట్రిక్ టన్నులకు మించి ధాన్యం వచ్చిన 110 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లను ఏర్పాటు చేసే విషయంపై చర్చించారు. జిల్లాలోని 10 మార్కెట్ యార్డుల్లో ప్రభుత్వం రెండు మార్కెట్‌లకు మొబైల్ గ్రైన్ డ్రయ్యర్లు సమకూర్చిందన్నారు. వాటిని అన్ని మార్కెట్ యార్డ్‌లలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. సమావేశంలో జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఛాయాదేవి, డీఎస్‌ఓ వెంకటేశం, డీఎం హరీష్, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, డీసీఓ పత్యానాయక్ పాల్గొన్నారు.