
సమర్థవంతంగా విధులు నిర్వహించాలి
నల్లగొండ: వర్షాకాల నేపథ్యంలో పట్టణ ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ట్రాఫిక్ పోలీసులకు రెయిన్‌కోట్లు, కంటి అద్దాలు తరితర పరికరాలను పంపిణీ చేశారు. విధుల నిర్వహణలో ముగ్గురు హోం గార్డులు చనిపోగా బాధిత కుటుంబాలకు హోం గార్డ్స్ సంక్షేమ నిధుల నుంచి రూ.15వేలు, అనారోగ్యం కారణంగా మెడికల్ చికిత్స పొందిన ఐదుగురు హోం గార్డులకు రూ.10 వేలు, హోం గార్డ్ పిల్లల వివాహం కోసం ఇద్దరికి రూ.5 వేలు, మెరిట్ స్కాలర్‌షిప్ కింద ముగ్గురికి రూ.5 వేల చెక్‌ను ఎస్పీ అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ట్రాఫిక్ సీఐ మహా లక్ష్మయ్య, ఆర్‌ఐలు సంతోష్, శ్రీను, హరిబాబు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
ఫ ఎస్పీ శరత్ చంద్ర పవార్
పోలీస్ వృత్తి నైపుణ్యాలపై జోనల్ స్థాయి డ్యూటీ మీట్
నల్లగొండ: వరంగల్‌లో నిర్వహించనున్న రాష్ట్ర రెండవ పోలీస్ డ్యూటీ మీట్ నేపథ్యంలో యాదాద్రి జోనల్ స్థాయిలో కేసుల దర్యాప్తు, పోరెన్సీక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్, నేర పరిశోధన ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, కంప్యూటర్ అవైర్‌నెస్, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీం అంశాలపై నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పోలీసు అధికారులు, సిబ్బంది జోనల్ స్థాయి డ్యూటీ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో కేసుల దర్యాప్తు, నేర పరిశోధనలో ఎదురవుతున్న అంశాలపై సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు. జోనల్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికై యాదాద్రి జోన్‌కు మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, నరసింహాచారి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.