
సమాజ సేవలో భాగస్వాములు కావాలి
నల్లగొండ : ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం సమాజ సేవలో భాగస్వాములు కావాలని మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ కోరారు. మంగళవారం నల్లగొండలో నార్కట్‌పల్లి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎండీ.ఇస్మాయిల్ పదవీవిరమణ సన్మానసభలో ఆయన మాట్లాడారు. 42 సంవత్సరాలుగా ఇస్మాయిల్ అధ్యాపక వృత్తిలో అంకితభావంతో పనిచేశారని పేర్కొన్నారు. వృత్తిపై నిబద్ధత గల వ్యక్తి ఎండి ఇస్మాయిల్ అని కొనియాడారు. అనంతరం ఇస్మాయిల్ దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో డీఐఈఓ దస్రూనాయక్, టీజీఓ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎండీ.ముజుముద్దీన్, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు.