ముగిసిన రేషన్‌ పంపిణీ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన రేషన్‌ పంపిణీ

Jul 1 2025 5:16 PM | Updated on Jul 1 2025 5:16 PM

ముగిసిన రేషన్‌ పంపిణీ

ముగిసిన రేషన్‌ పంపిణీ

నల్లగొండ : మూడు మాసాల రేషన్‌ పంపిణీ సోమవారంతో ముగిసింది. జిల్లాలో 85 శాతం మంది రేస్‌షాపుల ద్వారా సన్న బియ్యం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడు లేనివిధంగా వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామీణ ప్రాంత ప్రజలు రేషన్‌షాపులకు వెళ్లి బియ్యం తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో జూన్‌, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్‌ కోటాను జూన్‌లోనే ఇచ్చింది. ఆ కోటా పంపిణీ ముగియడంతో రెండు నెలలపాటు రేషన్‌ దుకాణాలు మూతపడనున్నాయి.

సెప్టెంబర్‌ 1న మళ్లీ ఓపెన్‌

జూన్‌, జులై, ఆగస్టు మాసాలకు సంబంధించిన బియ్యం కోటా జూన్‌ మాసంలోనే రేషన్‌ షాపుల ద్వారా పేదలకు పంపిణీ చేశారు. ఆ ప్రక్రియ మొత్తం ముగిసిపోయింది. జిల్లాలో 85 శాతం కార్డుదారులు జిల్లాలో రేషన్‌ తీసుకున్నారు. అయితే బియ్యం పంపిణీలో పోర్టబులిటీ ఉన్నందున ఇతర జిల్లాల్లో కూడా నల్లగొండ జిల్లాకు సంబంధించిన కార్డుదారులు 10 శాతం వరకు బియ్యం తీసుకుని ఉండవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. మూడు నెలల కోటా జూన్‌లో ఇచ్చినందున జూలై, ఆగస్టు నెలల్లో రేషన్‌షాపుల్లో మూత పడనున్నాయి. సెప్టెంబరు 1 నుంచి మళ్లీ రేషన్‌ షాపులు తెరుచుకోనున్నాయి.

ఫ సన్న బియ్యం తీసుకున్న 85 శాతం లబ్ధిదారులు

ఫ రెండు నెలలపాటు మూతపడనున్న రేషన్‌ షాపులు

రేషన్‌ పంపిణీ ఇలా..

రేషన్‌ దుకాణాలు 994

మొత్తం కార్డులు 4,84,210

బియ్యం తీసుకున్నవారు 4,10,284

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement