
ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి
నల్లగొండ : ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఆదేశించారు. సోమవారం గ్రీవెన్స్‌డేలో సందర్భంగా కలెక్టరేట్‌కు బాధితులు తరలి వచ్చారు. వారి నుంచి అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ వినతులు స్వీకరించారు. మొత్తం 122 మంది ఫిర్యాదులు అందించగా 67 రెవెన్యూ శాఖకు, మిగతావి ఇతర శాఖలకు సంబంధించినవి వచ్చాయి. వాటిని పరిష్కరించాలని ఆయా శాఖలకు పంపారు.
ఫ అదనపు కలెక్టర్ శ్రీనివాస్
ఫ గ్రీవెన్స్‌డేలో వినతుల స్వీకరణ