
అరకొర సిబ్బందితో అంతంత మాత్రంగానే..
నకిరేకల్ : నకిరేకల్ మున్సిఫాలిటిలో మొత్తం 20 వార్డులు ఉన్నాయి. రోజూ చెత్తను తరలించేందుకు రెండు ట్రాక్టర్లు, ఆరు ఆటోలు వినియోగిస్తున్నారు. మొత్తం 71 మంది పారిశుద్ధ్య సిబ్బంది పని చేస్తున్నారు. వీరు డ్రెయినేజీలను శుభ్రం చేయడం పాటు.. వాహనాల ద్వారా ఇంటింటా చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. సిబ్బంది తక్కువగా ఉండడంతో పారిశుద్ధ్య పనులు పూర్తి స్థాయిలో చేయడం లేదు. దీంతో కొన్ని వీధుల్లో నెలల తరబడి డ్రెయినేజీల్లో పేరుకుపోయిన పూడికను తొలగించడం లేదు. చాలా చోట్ల రోడ్లు వెంట చెత్త కూడా దర్శనమిస్తోంది.

అరకొర సిబ్బందితో అంతంత మాత్రంగానే..