
వైద్య వృత్తి పవిత్రమైనది
నల్లగొండ : సమాజంలో వృత్తి వైద్య పవిత్రమైనదని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నేషనల్ డాక్టర్స్‌డే సందర్భంగా మంగళవారం ఆమె తన క్యాంపు కార్యాలయంలో ఉత్తమ సేవలందించిన డాక్టర్లను శాలువా, జ్ఞాపికలతో సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ ఆపద సమయంలో ఆపద్బాందవుల్లా కనిపించే వైద్యులను ప్రజలు గౌరవిస్తారన్నారు. మనిషికి ఎంత సంపద ఉన్నా అనుభవించే ఆరోగ్యం లేకపోతే వృథా అన్నారు. అనారోగ్యంతో బాధపడే వారిని కాపాడే శక్తి కేవలం వైద్యులకే ఉందన్నారు. ప్రజలకు మంచి వైద్య సేవలు అందించి అందరి మన్ననలను పొందాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ పుట్ల శ్రీనివాస్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ మాతృనాయక్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.