
దుర్గందం వెదజల్లుతున్న మిర్యాలగూడ వీధులు
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మున్సిపాలిటీలో మొత్తం వార్డు 48 ఉన్నాయి. మొత్తం 278 కార్మికులు 18 ట్రాక్టర్లు, 48 ఆటోల ద్వారా రోజూ రోజూ 50 మెట్రిక్ టన్నులు చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అయినా మున్సిపాలిటీలో రోడ్లు, వీధుల వెంట చెత్త కుప్పలు.. కుప్పలుగా కనిపిస్తోంది. చెత్తను పూర్తిగా తరలించకుండా కొన్ని చోట్ల చెత్తను అక్కడే కాలుస్తున్నారు. దీంతో దుర్వాసన, పొగతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కాలనీల్లోని ఖాళీ స్థలాల్లోనూ చెత్త వేస్తుండడంతో దోమల బెడద పెరిగి జనం అలాఅలడుతున్నారు. ఇక డ్రెయినేజీలు పూడికతో నిండిపోయాయి. ప్రధాన నాలాలు ఇటీవల కొంత పూడిక తీసినా.. వీధుల్లోని మురుగుకాల్వలు చెత్తాచెదారంతో నిండిపోయి దుర్ఘంధం వెదజల్లుతున్నాయి.

దుర్గందం వెదజల్లుతున్న మిర్యాలగూడ వీధులు