
నేడు నల్లగొండకు మంత్రుల రాక
● ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై సమీక్ష
నల్లగొండ : నల్లగొండకు బుధవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమకుమార్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డి రానున్నారు. నల్లగొండలోని కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్‌లో ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై వారు సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి మంత్రుల సమీక్షకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. సమీక్షించే అంశాలపై నోట్స్ తయారీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తదితర ఏర్పాట్లలో ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రులు ప్రారంభించనున్న ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కార్యాలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ బి.వెంకటేశ్వరరావు, ఈఈ శ్రీధర్‌రెడ్డి, డీఈ ఫణిజ, గణేష్‌కుమార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పుణ్య, కలెక్టరేట్ ఏఓ మోతిలాల్ పాల్గొన్నారు.
పోర్చుగల్‌లో ఉద్యోగాలకు దరఖాస్తులు
నల్లగొండ : తెలంగాణ ఓవర్సిస్ మ్యాన్ పవర్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో పోర్చుగల్‌లో ప్రైవేట్ ఉద్యోగాలకు ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోర్చుగల్‌లో ఖాళీగా ఉన్న ఎప్‌అండ్‌బీ మేనేజర్, హౌజ్ కీపర్, వెయిటర్, మెయిన్‌టెయిన్స్ టెక్నిషియన్, ఎగ్జిక్యూటివ్ టెక్నిషియన్, కుక్, కిచెన్ అసిస్టెంట్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఈవెంట్ కోఆర్డినేటర్ తదితర ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థులు tom com.resume@gmail.com వెబ్‌సైట్‌కు రెజ్యూమ్‌లను పంపాలని పేర్కొన్నారు. అర్హత, తదితర పూర్తి వివరాలకు 9440052592, 9440049937 ఫోన్‌ం నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
పథకాలను
వినియోగించుకోవాలి
డిండి : ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి సూచించారు. మంగళవారం డిండి మండల మహిళ సమాఖ్య సంఘాల నూతన కార్యవర్గాలకు నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలైన అద్దె బస్సులు, సోలార్ ప్లాంట్లు, డ్రోన్‌లు, ప్రమాద బీమా, పేదరిక నిర్మాలన తదతర అంశాలపై నూతన మహిళ సంఘ బంధాల సభ్యులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏపీఎం పురుషోత్తం పాల్గొన్నారు.
ఉచిత శిక్షణకు దరఖాస్తులు
నల్లగొండ : అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎంబీసీ నిరుద్యోగ యువతకు వివిధ నైపుణ్యాలకు సంబంధించిన కోర్సుల్లో నాలుగు రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి నిజాంఅలీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 21 నుంచి 30 సంవత్సరాల వరకు వయసు కలిగిన, డిగ్రీలో ఉత్తీర్ణులైన ఎంబీసీ యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాని పొందాలని తెలిపారు. tgobmms. cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. దరఖాస్తుతో పాటు సంబంధిత ధ్రువీకరణపత్రాలను జతచేసి ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా నల్లగొండ కలెక్టరేట్‌లోని బీసీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు.
ఉపాధ్యాయులు
టీచింగ్ డైరీ రాయాలి
నాంపల్లి : ప్రతి ఉపాధ్యాయుడు టీచింగ్ డైరీ రాయాలని డీఈఓ భిక్షపతి అన్నారు. మంగళవారం ఆయన నాంపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. బోధనోపకరణాలు ఉపయోగించి బోధించడంతో పాటు పాఠ్య ప్రణాళికలను తయారు చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. తరగతి గదుల్లో ఉపాధ్యాయుల బోధన తీరు పరిశీలించారు. విద్యార్థుల చేత స్వయంగా బోర్డుపై ఉన్న అడిషన్స్‌ను చదివించారు. అనంతరం భవిత కేంద్రం, ప్రైమరీ స్కూల్‌ను తనిఖీ చేశారు. ఆయన వెంట ఎంఈఓ మల్లికార్జునరావు ఉన్నారు.