
గోల్డ్ మెడల్స్‌కు విరాళాల స్వీకరణ
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ ఎన్జీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి సబ్జెక్ట్‌ల వారీగా ఓవరాల్‌గా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సుమారు 30 బంగారు పతకాలు ఇవ్వనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ తెలిపారు. దీని కోసం ఔత్సాహికుల నుంయి విరాళాలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో బంగారు పతకానికి రూ.1.5 లక్షలు కళాశాల అకౌంట్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఒక్కరు ఎన్ని బంగారు పతకాలకై నా ఇవ్వవచ్చని తెలిపారు. విరాళం డిపాజిట్ చేసిన వారి పేరు మీద కానీ.. వారు సూచించిన వారి పేరు మీద ప్రతి విద్యా సంవత్సరం బంగారు పతకాలు ప్రధానం చేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 22వ తేదీన కళాశాల స్థాపక దినోత్సవం రోజున బంగారు పతకాల ప్రధానోత్సవం ఉంటుందని తెలిపారు. వివరాలకు 98486 96776, 99898 97566 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని కోరారు.
పదవీ విరమణ పొందిన పోలీసులకు సన్మానం
నల్లగొండ : పోలీస్ శాఖలో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన పలువురిని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సన్మానించారు. వారికి పోలీస్‌శాఖ ద్వారా ఇవ్వాల్సిన ఆర్థికసాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఏఓ శ్రీనివాసులు, ఆర్‌ఐ సంతోష్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
వ్యవసాయంలో సాంకేతికను జోడించాలి
నల్లగొండ టౌన్ : రైతులను ఆర్థికంగా బలో పేతం చెందాలంటే వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికను జోడించాలని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ కో ఆపరేటివ్ వారోత్సవాల్లో భాగంగా ఇంగ్లాండ్‌లోని మాంచస్టల్ రాష్ట్రంలో బుధవారం ప్రారంభమైన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కో ఆపరేటివ్ వ్యవస్థ పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా రైతులు పంటల సాగుతో ఆయా దేశాల అభివృద్ధికి తమవంతు చేయూత అందిస్తున్నారన్నారు. రైతులకు పెద్దఎత్తున రుణాలు అందించి ఆదుకోవాలన్నారు. పాడి పరిశ్రమ, హార్టికల్చర్, సెరికల్చర్, పశు సంపదను పెంపొందించే అంశాలపై సహకార వ్యవస్థ దృష్టి సారించాలన్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ సమావేశాల్లో చర్చిస్తున్న అంశాలపై అవగాహన పెంచుకుని ఉమ్మడి జిల్లాలో సహకార వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు.
4న ఫుట్‌బాల్ జిల్లా జట్టు ఎంపిక
నల్లగొండ టూటౌన్ : మంచిర్యాలలో ఈనెల 9 నుంచి 12వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి బాలికల ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో పాల్గొనే జట్టును ఈనెల 4వ తేదీన నల్లగొండలోని ఎన్జీ కాలేజీలో ఎంపిక చేయనున్నట్లు ఫుట్‌బాల్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, అసోసియేషన్ అధ్యక్షుడు బండారు ప్రసాద్ తెలిపారు. సెలక్షన్ పోటీల నిర్వహణపై బుధవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. 1 జనవరి 2010 నుంచి 31డిసెంబర్ 2012 మధ్య జన్మించిన బాలికలు ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం తీసుకొని 4వ తేదీన ఉదయం 10 గంటలకు ఎన్జీ కాలేజీకి రావాలని పేర్కొన్నారు. ఇక్కడి పోటీల్లో ప్రతిభ కనభర్చిన వారిని రాష్ట్ర స్థాయి పంపుతామన్నారు. వివరాలకు 8374542407 ఫోన్‌నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. సమావేశంలో ఓరుగంటి శ్రీనివాస్, కందికట్ల దాస్, బొడ్డుపల్లి సునీత, కట్ట వెంకట్, మందడి సురేందర్‌రెడ్డి, కొప్పు ప్రవీణ్‌గౌడ్ పాల్గొన్నారు.
స్కూళ్లను తనిఖీ చేస్తాం
నల్లగొండ : జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేస్తామని డీఈఓ భిక్షపతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రమే తల్లిదండ్రులు వారి పిల్లలను చేర్పించాలని ఆయన సూచించారు. ప్రైవేట్ పాఠశాలల్లో యూనిఫాం, టై, బెల్టు, నోట్‌బుక్స్ అమ్మవద్దని, అధిక ఫీజులు వసూలు చేయవద్దని సూచించారు. నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గోల్డ్ మెడల్స్‌కు విరాళాల స్వీకరణ