
కలుపుతీసి ఎరువు పెట్టుకుంటాం
ప్రస్తుతం కురుస్తున్న వర్షం పత్తి చేలకు మంచి పదును ఇచ్చింది. వర్షం తగ్గగానే వెంటనే పత్తి చేలో కలుపు తీసుకుని ఎరువులు పెట్టుకుంటాం. చేను వాడుబడుతున్న సమయంలో వర్షం రావడం వల్ల పత్తి మొక్కలకు ప్రాణం వచ్చింది.
– పనస కాశయ్యగౌడ్, గుండ్లపల్లి, నల్లగొండ మండలం
రైతులు సంతోషంగా ఉన్నారు
అల్ప పీడనం కారణంగా జిల్లా అంతటా మంచి వర్షం కురిసింది. పత్తి చేలు వాడుతున్న దశలో వర్షం రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంచి పదునైనందున చేలకు ఎరువులు పెట్టుకోవచ్చు. నార్లు పోసుకున్న రైతులు కూడా పొలాలు దున్నుకుని నాట్లు వేసుకునే అవకాశం ఉంది.
– పాల్వాయి శ్రవణ్‌కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి