
మా కూతురి నుంచి రక్షించండి
నా కుమార్తె సామ అరుణ, భర్త ఆనంద్‌రెడ్డికి గిప్టుడీడ్ కింద 5 ఎకరాల 20 గుంటల భూమి ఇచ్చాం. అందులో ఇల్లు నిర్మించుకుని నివాసముంటూ మూడేళ్ల నుంచి మాపై దాడులు చేస్తూ.. మానసికంగా, శారీరకంగా బాధలు పెడుతోంది. మా తోటలో ఉన్న మమ్మల్ని కొట్టి చంపుతానని బెదిరిస్తోంది. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. నా చిన్నల్లుడికి అమ్మిన భూమిని కూడా సాగు చేయకుండా అడ్డుకుంటోంది. మా కూతురు నుంచి రక్షణ కల్పించి గిఫ్ట్‌డీడ్ రద్దు చేయాలి.
– నారాయణరెడ్డి–మణెమ్మ దంపతులు,
ఎరెడ్లగూడెం, గుర్రంపోడు మండలం