
పేదల డాక్టర్.. రంగారెడ్డి
ఫ సామాన్యులకు వైద్యం అందుబాటులోకి తేవాలన్నదే ఆయన తపన
ఫ సూర్యాపేటలో ఆస్పత్రి నెలకొల్పిన తొలుత రూ.5కే వైద్య సేవలు
ఫ ప్రస్తుతం రూ.20లకే ఓపీ
ఫ పూర్వవిద్యార్థుల సేవాసమితి ఏర్పాటు చేసి పలు కార్యక్రమాలునేడు డాక్టర్స్‌డే
సూర్యాపేట అర్బన్: పేద రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన ఓ వ్యక్తి కష్టపడి చదవి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. పేదలకు వైద్యం అందుబాటులో తీసుకురావాలనే ఆలోచనతో ఆస్పత్రి ఏర్పాటు చేసుకొని నామమాత్రపు ఫీజుతో వైద్య సేవలు అందిస్తూ పేదల వైద్యుడిగా పేరుగాంచారు. పూర్వ విద్యార్థుల సేవా సమితి ఏర్పాటు చేసి వైద్య శిబిరాలతో పాటు అనేక సేవకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సూర్యాపేట పట్టణంలోని ఆదిత్య ఆస్పత్రి డాక్టర్ రంగారెడ్డి. నేడు డాక్టర్స్ డే సందర్భంగా వైద్యుడి జీవిత విశేషాలు, వైద్య రంగంలో చేస్తున్న సేవలు ఆయన మాటల్లోనే..