
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
నల్లగొండ : బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని అదనపు ఎస్పీ రమేష్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆపరేషన్ ముస్కాన్‌పై వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరాధరణకు గురైన, వెట్టి చాకిరికి గురవుతున్న బాలబాలికలను గుర్తించి వారిని చేరదీయడానికి ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముష్కాన్ కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా మూడు సబ్ డివిజన్ల పరిధిలో మూడు బృందాలను ఏర్పాటు చేసి ఆపరేషన్ ముష్కాన్ నిర్వహించాలన్నారు. సమావేశంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ కృష్ణయ్య, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అరుణ, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కృష్ణవేణి, ఏహెచ్‌టీయూ ఎస్‌ఐ రంగారెడ్డి పాల్గొన్నారు.