
నిరుపేదలకు వరంలా ప్రజా ప్రభుత్వం
మాడుగులపల్లి : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరుపేదలకు వరంలా మారిందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య అన్నారు. ఆదివారం మండలంలోని ధర్మాపురం, కన్నెకల్, గోపాలపురం గ్రామాల్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల కోసం స్థానిక అధికారులు, నాయకులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారన్నారు. నిరుద్యోగులకు 60వేల ఉద్యోగాలు, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు, సన్నబియ్యం, రైతులకు రైతు భరోసా, రుణమాఫీ చేశారన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పేదవాడికి ఇళ్లు, ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్రం సంక్షోభంలో ఉన్నా సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుందని, ఎవరూ అఽధైర్య పడవద్దన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సైదిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, బోడ యాదయ్య, కొత్త దశరధ, గద్దల శేఖర్, రామాంజిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, కొండ భాస్కర్, కొండేటి శంకర్, హౌసింగ్ ఏఈ జ్యోతి, పంచాయతీ కార్యదర్శులు హరికృష్ణ, నాగరమణి, ఇందిరమ్మ, లబ్ధిదారులు యాదయ్య, శంకర్, రేణుక, నాగయ్య పాల్గొన్నారు.