
సోములు విగ్రహావిష్కరణ
మిర్యాలగూడ : పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉబ్బపల్లి సోములు కాంస్య విగ్రహాన్ని ఆదివారం మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉబ్బపల్లి సోములు ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు. వ్యక్తిగతంగా సోములు తనకు దగ్గరి మిత్రుడన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, బీఆర్‌ఎస్ నాయకులు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, యడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, అన్నభీమోజు నాగార్జునచారి, మగ్ధుమ్‌పాషా, మట్టపల్లి సైదయ్యయాదవ్, ఇలియాస్‌ఖాన్, మెరుగు రోశయ్య, మాజీద్, రామలింగయ్యయాదవ్, శ్రీనివాస్‌యాదవ్, రామస్వామి, దైవ వెంకటేష్, పీసీకే ప్రసాద్, విష్ణు, సోముసుందర్ పాల్గొన్నారు.