
రూ. 2 లక్షల రుణమాఫీ పూర్తిచేయాలి
త్రిపురారం : రైతులకు ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు వీరపెల్లి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం త్రిపురారం మండల కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రెండో మండల మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటలను విస్మరించిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా రైతుల పక్షాణ చేస్తున్న పోరాటాలను అనచివేస్తు రైతలకు నష్టం చేసే నల్ల చట్టాలను తీసుకవచ్చిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో త్రిపురారం మండల రైతు సంఘం అధ్యక్షుడు కొప్పు వెంకన్న, సీపీఎం మండల కార్యదర్శి దైద శ్రీను, కందిమళ్ల వీరారెడ్డి, వెంకటయ్య, రాములు, రామచంద్రు కోటయ్య పాల్గొన్నారు.