
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
మిర్యాలగూడ అర్బన్ : జూలై 9న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మల్లు గౌతమ్‌రెడ్డి, హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు తిరుపతి రామ్మూర్తి కోరారు. ఆదివారం స్థానిక ఎప్‌సీఐ వద్ద సివిల్ సప్లయ్ హమాలి కార్మికులకు సార్వత్రిక సమ్మె కరపత్రాలను పంపిణీ చేసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మికుల చట్టాలను తుంగలో తొక్కి నాలుగు నల్ల లేబర్ చట్టాలను తీసుకవచ్చిందని ఆరోపించారు. ఈ నాలుగు చట్టాల వలన కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారని అన్నారు. ఈ సమ్మెలో పాల్గొనేందుకు కార్మికులందరు పనులను బంద్ చేసి సమ్మెలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమలో యూనియన్ నాయకులు అంజన్‌రావు, బాలకృష్ణ తదితరులున్నారు.