బైక్‌లు చోరీ చేస్తున్న బాలుడి అరెస్ట్
మిర్యాలగూడ అర్బన్: బైక్‌లు చోరీ చేస్తున్న బాలుడిని మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వన్‌టౌన్ సీఐ మోతీరాం విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం చింతపల్లికి చెందిన నందిపాటి తరుణ్ మిర్యాలగూడలోని ఓ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. తన బైక్‌ను గత నెల 29న రాత్రి హాస్టల్‌లో పెట్టి నిద్రించాడు. మరుసటిరోజు చూసేసరికి బైక్ కనిపించలేదు. దీంతో వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శనివారం ఉదయం మిర్యాలగూడలోని ఈదులగూడ చౌరస్తాలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. అటుగా బైక్‌పై వచ్చిన బాలుడు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. బైక్‌లు చోరీ చేసి విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు గతంలోనూ హైదరాబాద్‌లో, ఏపీలోని పెనుగంచిప్రోలులో బైక్‌లు చోరీ చేశాడని, ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు అతడి అరెస్ట్ చేసి నాంపల్లిలోని జువైనల్ కోర్టులో హాజరుపరిచే క్రమంలో కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోయినట్లు సీఐ తెలిపారు. అతడి వద్ద నుంచి రూ.11.50 లక్షల విలువైన ఐదు బైక్‌లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.


