ఇందిరమ్మ ఇళ్ల పనుల జాబితా సమర్పించాలి
నల్లగొండ : ఇందిరమ్మ ఇళ్ల పనులు ఏస్థాయిలో ఉన్నాయో జాబితాలను సంబంధిత శాఖల ఇంజనీరింగ్ అధికారులు సమర్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం ఆమె తన చాంబర్‌లో ఇందిరమ్మ ఇళ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, మిషన్ భవిత కేంద్రాల నిర్మాణం, ప్రభుత్వ పనులకు ఇసుక సరఫరాపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్మాణాలకు అవసరమయ్యే ఇసుకను తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సరఫరా చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు స్థానిక వాగుల నుంచి నేరుగా ఇసుకను తీసుకోవద్దని, ముందుగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఆయా మండలాల వారీగా ఇసుక లభ్యమయ్యే వనరుల జాబితా సమర్పించాలని జిల్లా మైనింగ్ అధికారిని ఆదేశించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణ పనుల వివరాలను సమర్పించాలని జిల్లా ఇరిగేషన్ అధికారికి సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, జిల్లా మైనింగ్ అధికారి శామ్యూల్ జాకబ్, గృహ నిర్మాణ సంస్థ ిపీడీ రాజ్‌కుమార్, జిల్లా ఇరిగేషన్ అధికారి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి


