
ఘనంగా లక్ష పుష్పార్చణ
నార్కట్‌పల్లి : చెర్వుగట్టు గ్రామంలో గల శ్రీపార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం అర్చకులు వేద మంత్రాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. అమావాస్య కావడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు సాయంత్రం నుంచే ఆలయానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. వచ్చారు. భక్తులు రాత్రి కొండపైన నిద్రించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఆలయ సిబ్బంది, పోలీసులు తగు చర్యలు తీసుకున్నారు. లక్ష పుష్పార్చనలో ఈఓ నవీన్‌కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, సతీష్ శర్మ, సురేష్ శర్మ, శ్రీకాంత్ శర్మ, సీనియర్ అసిస్టెంట్ ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.