
2 నుంచి యువ రుణాలు
నల్లగొండ: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ వర్గాల్లో ఎంపిక చేసినవారికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న తొలి విడతగా రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు రుణాలు అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే మండల స్థాయిలో ఎంపీడీఓలు, మున్సిపాలిటీల్లో కమిషనర్లు అర్హుల జాబితాను ఎంపిక చేసి జిల్లా కమిటీకి పంపించారు.
79,493 మంది దరఖాస్తులు
రాజీవ్ యువ వికాసం పథకం కింద రుణాల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇబీసీ, మైనార్టీ వర్గాల నిరుద్యోగ యువతీయువకులు ఆయా శాఖలకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 79,493 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులన్నింటినీ మండలాల్లో ఎంపీడీఓలు, మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమిషనర్లు పరిశీలించి జాబితాలను జిల్లా అధికారులకు నివేదించారు.
నియోజకవర్గాల్లో రుణాల పంపిణీ
జూన్ 2న అన్ని నియోజకవర్గాల పరిధిలో రూ.లక్షలోపు రుణాలకు ఎంపికై న లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలు అందించనున్నారు.
రాజీవ్ యువ వికాస పథకం అమలుకు ప్రభుత్వం శ్రీకారం
ఫ రాష్ట్ర అవతరణ దినోత్సవం
సందర్భంగా రుణాలు అందజేత
ఫ తొలి విడతగా రూ.50 వేల
నుంచి రూ.లక్ష వరకు..
ఫ జిల్లా కమిటీకి చేరిన అర్హుల జాబితా
జూన్‌లో 3 వేల మందికి రుణాలు
రాజీవ్ యువ వికాసం పథకం కింద రూ.లక్ష లోపు రుణాలకు లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అర్హులైన దాదాపు 3 వేల మందికి జూన్‌లో కేటగిరీల వారీగా రుణాలు అందించేలా కార్యాచరణ రూపొందించాం.
– శేఖర్‌రెడ్డి, డీఆర్‌డీఓ, నల్లగొండ
ఐదు విడతల్లో రుణాలు ఇచ్చేలా..
ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం కింద ఐదు విడతల్లో రుణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలివిడతలో భాగంగా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు జూన్ నెలలో రుణాలు అందించనున్నారు. ఇందు కోసం దాదాపు 3వేల మంది వరకు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఇవ్వనున్నారు. ఇందులో మిగిలిన లబ్ధిదారులకు ఇదే నెలాఖరులోగా అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అలాగే రెండో విడతలో భాగంగా జూలైలో రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు అందించనుంది. అలాగే ఆగస్టులో మూడో విడతలో భాగంగా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల లోపు రుణాలు, చివరగా సెప్టెంబర్లో నాలుగు, ఐదు విడతల్లో రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారిని ఎంపిక చేసి అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

2 నుంచి యువ రుణాలు

2 నుంచి యువ రుణాలు