రామగిరి(నల్లగొండ) : డాక్టర్ బిఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ రెండవ, నాలుగు, ఆరవ సెమిస్టర్ విద్యార్థులు మే 31వ తేదీలోగా పరీక్ష ఫీజులు చెల్లించాలని ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్, డాక్టర్ బిఆర్.అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ అంతటి శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో కోరారు. పరీక్షల షెడ్యూల్ విడుదలైందని.. ఆరో సెమిస్టర్ జూన్ 20 నుంచి 25 వరకు, నాలుగో సెమిస్టర్ జూన్ 26 నుంచి జూలై 2 వరకు, రెండవ సెమిస్టర్ పరీక్షలు జూలై 4 నుంచి 10వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు.