పోలీస్‌ గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ

May 6 2025 1:20 AM | Updated on May 6 2025 1:20 AM

పోలీస

పోలీస్‌ గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ

నల్లగొండ : పోలీస్‌ గ్రీవెన్స్‌డే సందర్భంగా జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ 35 మంది బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఆయా కేసుల పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. పోలీస్‌స్టేషన్‌కి వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి.. చట్ట పరంగా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు.

గోదాముల్లో తూకం వేశాకే ఇవ్వాలని వినతి

నల్లగొండ : గోదాముల్లో బియ్యం తూకం వేసిన తర్వాతనే రేషన్‌ డీలర్లకు బియ్యం సరఫరా చేయాలని కోరుతూ రేషన్‌ డీలర్లు సోమవారం కలెక్టర్‌ ఇలా త్రిపాఠికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రేషన్‌ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పారేపల్లి నాగరాజు మాట్లాడుతూ బియ్యం తూకం వేయకుండా బస్తాల లెక్కన ఇవ్వడం వల్ల తరుగు వస్తోందన్నారు. డీలర్ల వద్ద ఉన్న దొడ్డు బియ్యాన్ని గోదాములకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వైద్యుల సత్యనారాయణ, సర్వయ్య, డీలర్లు పాల్గొన్నారు.

రెవెన్యూ సదస్సులు ప్రారంభం

నకిరేకల్‌ : భూ భారతి పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపికై న నకిరేకల్‌ మండలంలో సోమవారం రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయి. తాటికల్‌ శివారులోని తెట్టెకుంట, గొల్లగూడెం శివారులోని అడివిబొల్లారం గ్రామాల్లో అధికారులు సదస్సులు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో రైతులు వివిధ భూ సమస్యలపై దరఖాస్తులు చేసుకున్నారు. భూ భారతి చట్టంపై రైతులకు అధికారులు అవగాహన కల్పించారు. తెట్టెకుంటలో ఒకటి, అడివిబొల్లారంలో 8 దరఖాస్తులు వచ్చాయి. ఆయా కార్యక్రమాల్లో నకిరేకల్‌, కట్టంగూరు తహసీల్దార్లు జమురుద్దీన్‌, ప్రసాద్‌నాయక్‌, డీటీ రామకృష్ణ, ఆర్‌ఐలు చిరంజీవి, మధు, రజనీకాంత్‌, అరవింద్‌, మోదిల్‌ పాష, తేజ, రాజు పాల్గొన్నారు.

రెమ్యునరేషన్‌ను చెల్లించాలి

నల్లగొండ : గతేడాది నవంబర్‌ నెలలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుటుంబ కులగణన సర్వేలో పాల్గొన్న ఉద్యోగులకు రెమ్యునరేషన్‌ ఇవ్వాలని టీఎస్‌యూటీఎఫ్‌ ఆద్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్‌ ఇలా త్రిపాఠికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ కుటుంబ సర్వేలో పాల్గొన్న ఉద్యోగులకు రెమ్యునరేషన్‌ ఇవ్వడంలో జాప్యం చేయడం శోచనీయమన్నారు. వారం రోజుల్లోగా రెమ్యునరేషన్‌ చెల్లించకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, ఉపాధ్యక్షుడు నర్రా శేఖర్‌రెడ్డి, కోశాధికారి వడ్త్యా రాజు, ఎడ్ల సైదులు, శ్రీనివాస్‌రెడ్డి, గేర నర్సింహ, నలపరాజు వెంకన్న, ఎ.చిన్నవెంకన్న, కొమర్రాజు సైదులు, మధుసూదన్‌, రాగి రాకేష్‌ పాల్గొన్నారు.

పోలీస్‌ గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ1
1/3

పోలీస్‌ గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ

పోలీస్‌ గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ2
2/3

పోలీస్‌ గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ

పోలీస్‌ గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ3
3/3

పోలీస్‌ గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement