హిందూ ధర్మాన్ని పాటిద్దాం | - | Sakshi
Sakshi News home page

హిందూ ధర్మాన్ని పాటిద్దాం

May 19 2026 2:10 AM | Updated on May 19 2026 2:10 AM

కందనూలు: హిందూ సమాజం సంస్కృతీ సంప్రదాయాలను పిల్లలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందని విశ్వహిందూ పరిషత్‌ జాతీయ అధికార ప్రతినిధి రాంనూతల శశిధర్‌ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని ఈదమ్మగుడి బస్తీలో ఏర్పాటుచేసిన హిందూ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో పురాతన కాలం నుంచి కొనసాగుతున్న సంస్కృతీ, సంప్రదాయాలను భావితరాల వారికి తెలియజేయడం అందరి బాధ్యతని అన్నారు. హిందూ సమాజంపై గౌరవభావం, ఏకాత్మకతా భావన, స్వధర్మంపై అంకితభావం, సేవాగుణం వంటి వాటిని వికసింపజేయాలని కోరారు. కార్యక్రమంలో ఓం భారత్‌ శక్తిపీఠం వ్యవస్థాపకులు భారతనంద మహారాజ్‌, ఉత్సవ సమితి అధ్యక్షుడు భానుప్రకాశ్‌, కార్యదర్శి రమేశ్‌, కౌన్సిలర్లు పాండు, కొత్త గంగాధర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement